Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 47
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
1 సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి;
దేవునికి ఆనందంతో కేకలు వేయండి.
 
2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు,
భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.
3 ఆయన దేశాలను మన వశం చేశారు,
జనాలను మన పాదాల క్రింద ఉంచారు.
4 మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు.
అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము.
సెలా
 
5 దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు,
యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.
6 దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి;
మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.
7 దేవుడు భూమి అంతటికి రాజు;
ఆయనకు స్తుతికీర్తన పాడండి.
 
8 దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు;
దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.
9 దేశాల అధిపతులు సమకూడతారు
అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు
భూమి మీద డాళ్లు[a] దేవునికి చెందినవి;
ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.

<- కీర్తనలు 46కీర్తనలు 48 ->