Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 133
దావీదు యాత్రకీర్తన
1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం
ఎంత మేలు! ఎంత మనోహరం!
 
2 అది అహరోను తలమీద పోయబడి
అతని గడ్డం మీదుగా కారుతూ,
వస్త్రపు అంచు వరకు కారిన
ప్రశస్తమైన తైలం వంటిది.
3 అది సీయోను కొండలమీదికి దిగివచ్చే
హెర్మోను మంచులా ఉంటుంది.
యెహోవా తన ఆశీర్వాదాన్ని,
జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.

<- కీర్తనలు 132కీర్తనలు 134 ->