6 ఆ వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉండగా, మందిరం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడడం విన్నాను. 7 ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో[b] వారి అంత్యక్రియల అర్పణల[c] ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు. 8 నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను. 9 ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని, 11 వారు చేసిన పనులన్నిటికి వారు సిగ్గుపడితే, వారికి ఆలయ రూపకల్పనను గురించి అనగా దాని అమర్చిన విధానం, దానిలోనికి వచ్చే బయటకు వెళ్లే ద్వారాల గురించి, దాని మొత్తం రూపకల్పన గురించి, దాని అన్ని నియమాలు, చట్టాలను తెలియజేయాలి. వారు దాని రూపకల్పన పట్ల నమ్మకంగా ఉండగలిగేలా, వారు దాని నియమానలన్నింటినీ అనుసరించేలా చేయడానికి వాటిని వారి ముందు వ్రాసిపెట్టాలి.
12 “ఇది ఆలయ నియమం: పర్వతం పైన ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆలయ ధర్మం అలాంటిది.
18 అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి: 19 నా సన్నిధిలో సేవ చేయడానికి వచ్చే సాదోకు కుటుంబీకులు లేవీయులైన యాజకులకు పాపపరిహారబలి అర్పించడానికి కోడెదూడను ఇవ్వాలని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 20 వారు దానిని పాపపరిహారబలిగా అర్పించి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసి దాన్ని శుద్ధీకరించడానికి ఆ దూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠపు నాలుగు కొమ్ము మీద, పై గట్టు నాలుగు మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద ఉంచాలి. 21 మీరు పాపపరిహారబలి కోసం ఎద్దును తీసుకెళ్లి, పరిశుద్ధాలయం బయట ఆలయ ప్రాంతంలోని నిర్ణయించబడిన భాగంలో కాల్చాలి.
22 “రెండవ రోజున పాపపరిహారబలిగా ఏ లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెతో బలిపీఠానికి పాపపరిహారం చేసినట్లే మేకపోతుతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి. 23 దానిని శుద్ధి చేయడం పూర్తి చేసిన తర్వాత ఏ దోషంలేని కోడెను, పొట్టేలును అర్పించాలి. 24 మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు.
25 “రోజుకు ఒకటి చొప్పున వరుసగా ఏడు రోజులు పాపపరిహారబలిగా మేకపోతులను సిద్ధం చేయాలి. అలాగే మందలో నుండి ఏ లోపం లేని కోడెను పొట్టేలును సిద్ధం చేయాలి. 26 ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. అలా వారు దానిని ప్రతిష్ఠించాలి. 27 ఈ రోజులన్నీ ముగిసిన తర్వాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు మీ సమాధానబలులు అర్పిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
<- యెహెజ్కేలు 42యెహెజ్కేలు 44 ->
Languages