10 బయటి ఆవరణ గోడ పొడవున దక్షిణం వైపున,[c] ఆలయ ప్రాంగణానికి ఆనుకుని, బయటి గోడకు ఎదురుగా గదులు ఉన్నాయి, 11 వాటికి ముందు ఒక మార్గం ఉంది. అవి ఉత్తరాన ఉన్న గదుల్లా ఉన్నాయి; అవి ఒకే విధమైన బయటకు వెళ్లే ద్వారాలు, కొలతలతో ఒకే పొడవు, వెడల్పు కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వారాల మాదిరిగానే, 12 దక్షిణాన ఉన్న గదుల ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న గోడకు ఎదురుగా ఉన్న ఆవరణంలోకి వెళ్లే దారి మొదట్లో ఆ గదుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది.
13 అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది. 14 యాజకులు పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత, వారు పరిచర్య చేసే వస్త్రాలను విప్పివేసే వరకు వారు బయటి ఆవరణంలోనికి వెళ్లకూడదు, ఎందుకంటే ఇవి పరిశుద్ధమైనవి. ప్రజలు ఉండే స్థలానికి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు ధరించాలి.”
15 అతడు లోపలి మందిరాన్ని కొలవడం పూర్తి చేసిన తర్వాత అతడు నన్ను తూర్పు ద్వారం గుండా తీసుకెళ్లి చుట్టూ ఉన్న స్థలాన్ని కొలిచాడు. 16 తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు[d] ఉంది. 17 అలాగే ఉత్తరం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 18 దక్షిణం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 19 అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది. 20 అతడు ఆ స్థలాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పరిశుద్ధ స్థలాన్ని సాధారణ స్థలాన్ని వేరు చేయడానికి దాని చుట్టూ అయిదువందల మూరల పొడవు అయిదువందల మూరల వెడల్పు గల ఒక గోడ ఉంది.
<- యెహెజ్కేలు 41యెహెజ్కేలు 43 ->
Languages