Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 61
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
1 ఓ దేవా! నా మనవి వినండి;
నా ప్రార్థన ఆలకించండి.
 
2 భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను,
నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను;
నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.
3 ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం,
శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
 
4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని
మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను.
సెలా
5 దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు;
మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు.
 
6 రాజు జీవితకాల దినాలను పొడిగించండి,
అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి.
7 అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు;
మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి.
 
8 అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను
దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.

<- కీర్తనలు 60కీర్తనలు 62 ->