Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 150
1 యెహోవాను స్తుతించండి.[a]
 
పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి;
ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
2 ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి;
ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి,
సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
4 కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి,
తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
5 తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో,
ఆయనను స్తుతించండి.
 
6 ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.
 
యెహోవాను స్తుతించండి.

<- కీర్తనలు 149