Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 125
యాత్రకీర్తన.
1 యెహోవాపై నమ్మకము ఉంచేవారు
కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు,
ఇప్పుడు ఎల్లప్పుడు
యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
 
3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద
దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు,
లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి
తమ చేతులను ఉపయోగిస్తారు.
 
4 యెహోవా, మంచివారికి
యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని
దుష్టులతో పాటు బహిష్కరిస్తారు.
 
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

<- కీర్తనలు 124కీర్తనలు 126 ->