Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 123
యాత్రకీర్తన.
1 పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా,
మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు,
దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు,
మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు
మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
 
3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి,
ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
4 మేము గర్విష్ఠుల
అంతులేని ఎగతాళిని,
అహంకారుల ధిక్కారాన్ని భరించాము.

<- కీర్తనలు 122కీర్తనలు 124 ->