Link to home pageLanguagesLink to all Bible versions on this site
కీర్తన 120
యాత్రకీర్తన.
1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను,
ఆయన నాకు జవాబిస్తారు.
2 యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి
మోసకరమైన నాలుక నుండి
నన్ను రక్షించండి.
 
3 ఓ మోసకరమైన నాలుకా,
దేవుడు నీకేం చేస్తారు?
ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?
4 వీరుల పదునైన బాణాలతో,
మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.
 
5 నేను మెషెకులో నివసించినందుకు,
కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!
6 సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో
చాలా కాలం నివసించాను.
7 నేను సమాధానం కోరుతున్నాను;
కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.

<- కీర్తనలు 119కీర్తనలు 121 ->