4 అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు.
6 అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.
7 అప్పుడు నేను రాజును, “రాజుకు ఇష్టమైతే నేను యూదా దేశం చేరుకునేవరకు నేను క్షేమంగా ప్రయాణించడానికి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు ఉత్తరాలు ఇవ్వండి. 8 పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు. 9 కాబట్టే నేను బయలుదేరి వెళ్లి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు రాజు ఉత్తరాలు ఇచ్చాను. రాజు నాతో పాటు సేనాధిపతులను గుర్రపు సేనను పంపించాడు.
10 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు.
13 రాత్రివేళలో నేను లోయ ద్వారం[a] గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను. 14 అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది. 15 రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను. 16 నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.
17 నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను. 18 అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను.
19 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన సేవకుడు టోబీయా, అరబీయుడైన గెషెము ఈ సంగతి విని మమ్మల్ని వేళాకోళం చేశారు. “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తారా?” అని మమ్మల్ని అడిగారు.
20 అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను.
<- నెహెమ్యా 1నెహెమ్యా 3 ->- a అంటే పశ్చిమాన ఉన్న ద్వారం యొక్క పేరు
Languages