3 అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
4 అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’[a] అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
5 తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు. 6 అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. 7 నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
8 అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి[b]’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
9 అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు. 10 ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
12 అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది”[d] అని అన్నారు.
13 అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
16 యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. 17 ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపుచుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది:
20 ఆ తర్వాత ఆ గ్రంథపుచుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. 21 అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు.
22 అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు.
23 యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేశావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు.
24 ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను. 25 ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు సత్యమే చెప్తున్నాను. 26 అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు. 27 ఎలీషా అనే ఇంకొక ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశపు నయమాను తప్ప మరి ఎవరు శుద్ధి పొందలేదు” అని చెప్పారు.
28 ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోప్పడ్డారు. 29 వారు లేచి, ఆయనను పట్టణం నుండి బయటకు తరుముతూ, ఆ పట్టణం కట్టబడి ఉన్న కొండ అంచు మీదకు తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడద్రోయాలనుకొన్నారు. 30 కానీ ఆయన జనసమూహం మధ్య నుండి నడుచుకుంటూ తన దారిన వెళ్లిపోయారు.
33 ఆ సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడు. వాడు స్వరమెత్తి బిగ్గరగా, 34 “నజరేతువాడా, యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు దేవుని పరిశుద్ధుడవు అని నాకు తెలుసు!” అని వాడు బిగ్గరగా కేకలు వేశాడు.
35 అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ దయ్యం వానికి ఏ గాయం చేయకుండ వారందరి ముందు వానిని పడవేసి బయటకు వచ్చేసింది.
36 ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఏంటి ఆ మాటలు! అధికారంతో శక్తితో ఈయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే, అవి బయటకు వచ్చేస్తున్నాయి!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. 37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది.
40 సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన వారందరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు. 41 అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటకు వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కాబట్టి ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
42 మరుసటిరోజు తెల్లవారగానే, యేసు ఏకాంత స్థలానికి వెళ్లారు. ప్రజలు ఆయనను వెదకుతూ ఆయన ఉన్న చోటుకు వచ్చి, ఆయనను వెళ్లిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. 43 కానీ ఆయన వారితో, “నేను ఇతర గ్రామాల్లో కూడా దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి, అందుకొరకే నేను పంపబడ్డాను” అని వారితో చెప్పారు. 44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు.
<- లూకా సువార్త 3లూకా సువార్త 5 ->
Languages