వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
7 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:
“చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను,
నా ప్రజల పాపాన్ని బట్టి
అంతకన్నా నేనేం చేయగలను?
8 వారి నాలుక మరణకరమైన బాణం;
అది మోసపూరితంగా మాట్లాడుతుంది.
వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు,
కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.
9 అందుకు నేను వారిని శిక్షించకూడదా?
ఇలాంటి దేశంపై
నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను,
అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను.
అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి,
పశువుల అరుపులు వినబడవు.
పక్షులన్నీ పారిపోయాయి
జంతువులు వెళ్లిపోయాయి.
11 “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా,
నక్కల విహారంగా చేస్తాను.
నేను యూదా పట్టణాలను
నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”
12 దీనిని గ్రహించగల జ్ఞాని ఎవరు? యెహోవా నుండి ఉపదేశం పొందుకొని దాన్ని వివరించగల వారెవరు? దేశం ఎందుకు శిథిలమై ఎవరు దాటలేని ఎడారిలా పాడైంది?
13 యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. 14 దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.” 15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “చూడండి, నేను ఈ ప్రజలను చేదు ఆహారం తినేలా, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను. 16 వారికి గాని వారి పూర్వికులకు గాని తెలియని దేశాల మధ్య వారిని చెదరగొట్టి, వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.”
“జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు
బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు
ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,
24 అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి:
నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని,
నేనే యెహోవానని, భూమిపై దయను,
న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని,
ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
25 “కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”