6 “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. 7 నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి[a] వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను. 8 వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి నుండి నేను వారిని శుద్ధి చేస్తాను, నాపై తిరుగుబాటు చేసిన వారి పాపాలన్నిటిని క్షమిస్తాను. 9 అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’
10 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో 11 సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ,
12 “సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి. 13 కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు.
14 “యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’
19 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: 20 “యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే, 21 అప్పుడు నా సేవకుడైన దావీదుతో తన సింహాసనంపై రాజ్యం చేయడానికి అతనికి ఒకడు లేకుండా పోడని నేను చేసిన నిబంధన, నా ఎదుట పరిచర్య చేస్తున్న యాజకులుగా ఉన్న లేవీయులతో నేను చేసిన నిబంధన వ్యర్ధం అవుతుంది. 22 నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”
23 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి: 24 “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు రాజ్యాలను[b] ఆయన తృణీకరించారు’ అని అనడం నీవు గమనించలేదా? కాబట్టి వారు నా ప్రజలను తృణీకరిస్తారు ఇకపై వారిని ఒక జనంగా పరిగణించరు. 25 యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను పగలు రాత్రితో నా ఒడంబడిక చేసి, భూమ్యాకాశాల నియమాలను స్థాపించి ఉండకపోతే, 26 అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”
<- యిర్మీయా 32యిర్మీయా 34 ->
Languages