3 అతడు ఆ పదకొండు వందల షెకెళ్ళ వెండిని తన తల్లికి తిరిగి ఇచ్చేసినప్పుడు ఆమె, “నేను నా వెండిని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుడు వెండితో పొదిగించిన ఒక విగ్రహం తయారుచేసిన తర్వాత అది తిరిగి నీకు ఇచ్చేస్తాను” అని అన్నది.
4 కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ[b] వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు.
5 మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు. 6 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
7 యూదా ప్రాంతంలోని బేత్లెహేములో యూదా కుటుంబీకులతో నివసిస్తున్న ఒక లేవీ యువకుడు, 8 యూదాలోని బేత్లెహేము పట్టణాన్ని విడిచి, తాను నివసించడానికి స్థలం వెదకడానికి వెళ్లాడు. ఆ పనిమీద వెళ్తూ అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని మీకా ఇంటికి వచ్చాడు.
9 మీకా అతన్ని, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు.
10 అప్పుడు మీకా ఆ లేవీయునితో, “నీవు నాతో నివసిస్తూ, నా తండ్రిగా, యాజకునిగా ఉండిపో. నేను సంవత్సరానికి పది షెకెళ్ళ[c] వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అన్నాడు. 11 కాబట్టి ఆ లేవీయుడు అతనితో ఉండడానికి ఒప్పుకున్నాడు, ఆ యువకుడు తన కుమారులలో ఒకనిగా అయ్యాడు. 12 మీకా ఆ లేవీయున్ని నియమించగా ఆ యువకుడు యాజకునిగా ఉంటూ ఆ ఇంట్లో నివసించాడు. 13 మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.
<- న్యాయాధిపతులు 16న్యాయాధిపతులు 18 ->
Languages