12 పడమర చివర యాభై మూరల వెడల్పు ఉండి, పది స్తంభాలు, పది దిమ్మలతో తెరలు ఉన్నాయి. ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి. 13 తూర్పు వైపు, అనగా సూర్యోదయం వైపు కూడా, యాభై మూరల వెడల్పు ఉంది. 14 ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల[d] పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి. 15 ఆవరణం యొక్క ద్వారానికి అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉన్నాయి. 16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి. 17 ఆ స్తంభాల దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల మీదున్న బద్దలు, కొక్కేలు వెండివి. వాటి పైభాగాలు వెండితో పొదిగించబడ్డాయి; అలా ఆవరణం యొక్క స్తంభాలన్నిటికి వెండి బద్దలు ఉన్నాయి.
18 ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో తెర తయారుచేయబడింది. అది ఇరవై మూరల పొడవు గల తెర,[e] ఆవరణం యొక్క తెరల్లా అయిదు మూరల[f] ఎత్తు ఉంది. 19 దానికి నాలుగు స్తంభాలు వాటిని నాలుగు దిమ్మలు ఇత్తడివి. దాని బద్దలు కొక్కేలు వెండివి. వాటి పైభాగం వెండితో పొదిగించబడ్డాయి. 20 సమావేశ గుడారం, దాని చుట్టూ ఉన్న ఆవరణం యొక్క గుడారపు మేకులన్నీ ఇత్తడివి.
25 జనాభా లెక్కలలో నమోదైన వారు ఇచ్చిన వెండి పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 100 తలాంతుల[h] 1,775 షెకెళ్ళు.[i] 26 ఇరవై సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగి నమోదు చేసుకున్న వారు అనగా 6,03,550 మంది పురుషులు తలా ఒక బెకా అంటే, అర షెకెల్,[j] పరిశుద్ధాలయ షెకెల్ చొప్పున చెల్లించారు. 27 100 తలాంతుల వెండిని పరిశుద్ధాలయ దిమ్మలకు ఉపయోగించారు. అవి తెరలకు దిమ్మలు; ఒక దిమ్మకు ఒక తలాంతు చొప్పున 100 దిమ్మలకు 100 తలాంతులు. 28 స్తంభాలకు కొక్కేలను, స్తంభం పై భాగంలో పోతపోయడానికి, వాటికి బద్దెలు చేయడానికి 1,775 షెకెళ్ళు ఉపయోగించారు.
29 ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు.[k] 30 ఆ ఇత్తడిని సమావేశ గుడారపు ద్వారం యొక్క దిమ్మల కోసం, ఇత్తడి బలిపీఠానికి, ఇత్తడి జల్లెడ, దాని పాత్రలన్నిటికి, 31 చుట్టూ ఉన్న ఆవరణానికి, దాని ద్వారానికి దిమ్మలు చేయడానికి, సమావేశ గుడారం, చుట్టూ ఉన్న ఆవరణపు అన్ని మేకులు చేయడానికి ఉపయోగించారు.
<- నిర్గమ 37నిర్గమ 39 ->- a అంటే, సుమారు 1.4 మీటర్లు
- b అంటే, సుమారు 2.3 మీటర్ల పొడవు, వెడల్పు
- c అంటే, సుమారు 45 మీటర్ల పొడవు
- d అంటే, సుమారు 7 మీటర్లు
- e అంటే, సుమారు 9 మీటర్లు
- f అంటే, సుమారు 2.3 మీటర్లు
- g బంగారం బరువు ఒక టన్ను.
- h అంటే, సుమారు 3.4 మెట్రిక్ టన్నులు; 27 వచనంలో కూడా
- i అంటే, సుమారు 20 కి. గ్రా. లు; 28 వచనంలో కూడా
- j అంటే, సుమారు 5.7 గ్రాములు
- k ఇత్తడి బరువు సుమారు 2.5 టన్నులు
Languages