2 “తప్పు చేయడంలో జనాన్ని అనుసరించవద్దు. మీరు ఒక దావాలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, జనంతో కలిసి న్యాయాన్ని వక్రీకరించవద్దు. 3 న్యాయం చేసేటప్పుడు పేదవారైనా సరే వారిపట్ల పక్షపాతం చూపకూడదు.
4 “ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి. 5 నిన్ను ద్వేషించేవారి గాడిద ఒకవేళ అది మోస్తున్న బరువు క్రింద పడివుండడం చూస్తే దానిని అలాగే వదిలేయవద్దు; దానిని లేపడానికి వానికి ఖచ్చితంగా సహాయం చేయాలి.
6 “న్యాయవిషయంలో పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. 7 తప్పుడు ఆరోపణలకు దూరంగా ఉండాలి, అమాయక లేదా నిజాయితీగల వ్యక్తిని చంపవద్దు, ఎందుకంటే నేను దోషులను నిర్దోషిగా ప్రకటించను.
8 “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
9 “పరదేశిని అణగద్రొక్కకూడదు; మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి విదేశీయుల జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా!
12 “ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.
13 “నేను మీతో చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి. మరొక దేవుళ్ళ పేరును ఉచ్చరించకూడదు. అవి మీ నోటి నుండి వినిపించకూడదు.
15 “పులియని రొట్టెల పండుగ జరుపుకోండి; నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో ఇలా తినండి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి వచ్చారు.
16 “మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి.
17 “సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
18 “పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు.
19 “మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.
27 “మీకు ఎదురయ్యే ప్రతి దేశానికి మీకు ముందుగా నా భయాన్ని పంపించి వారిని గందరగోళంలో పడవేస్తాను. నేను మీ శత్రువులందరిని వెనుతిరిగి పారిపోయేలా చేస్తాను. 28 మీ మార్గంలో నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టడానికి మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను. 29 కానీ నేను ఒకే సంవత్సరంలో వారిని తరిమికొట్టను, ఎందుకంటే భూమి నిర్జనమైపోతుంది, అడవి జంతువులు మీకు చాలా ఎక్కువై మీకు హాని కలిగిస్తాయి. 30 మీరు అభివృద్ధిచెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవరకు, కొద్దికొద్దిగా వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
31 “ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం[b] వరకు, అరణ్యం నుండి యూఫ్రటీసు నది వరకు నేను మీకు సరిహద్దులును ఏర్పరుస్తాను. ఆ దేశంలో నివసించే ప్రజలను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతారు. 32 వారితో గాని వారి దేవుళ్ళతో గాని ఎలాంటి ఒడంబడిక చేసుకోవద్దు. 33 వారిని మీ దేశంలో నివసింపనివ్వకండి లేదా మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు కారణమవుతారు, ఎందుకంటే మీరు వారి దేవుళ్ళను సేవించడం ఖచ్చితంగా మీకు ఉరి అవుతుంది.”
<- నిర్గమ 22నిర్గమ 24 ->
Languages