7 మీరు ఇతర జనాంగాల కంటే ఎక్కువగా ఉన్నారని కాదు జనాంగాలన్నిటిలో మీరే తక్కువగా ఉన్నారని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారు. 8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు. 9 కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు. 10 అయితే,
12 మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు. 13 ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు. 14 ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు. 15 యెహోవా మిమ్మల్ని ప్రతీ వ్యాధి నుండి కాపాడతారు. ఈజిప్టులో మీకు తెలిసిన భయంకరమైన రోగాల మీ మీదికి రాకుండా చేస్తారు, కాని మిమ్మల్ని ద్వేషించే వారందరి మీదికి వాటిని రప్పిస్తారు. 16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.
17 “ఈ జనాంగాలు మా కన్నా బలవంతులు. మేము వారినెలా వెళ్లగొట్టగలము?” అని మీలో మీరు అనుకోవచ్చు. 18 అయితే వారికి భయపడకండి; మీ దేవుడైన యెహోవా ఫరోకు, ఈజిప్టు దేశమంతటికి చేసింది జాగ్రతగా జ్ఞాపకం చేసుకోండి. 19 గొప్ప శోధనలు, సూచకక్రియలు, అద్భుతాలు, బలమైన హస్తం చాచిన చేతితో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని బయటకు తీసుకురావడం మీ కళ్లతో మీరే చూశారు. మీరు భయపడుతున్న ప్రజలందరికి మీ దేవుడైన యెహోవా అలాగే చేస్తారు. 20 అంతేకాక, మీకు కనబడకుండా దాక్కున్న మిగిలినవారంతా నశించే వరకు, మీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతారు. 21 మీరు వారికి భయపడకండి, ఎందుకంటే మీ మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, అద్భుత దేవుడు 22 మీ దేవుడైన యెహోవా ఆ జనాంగాలను మీ ఎదుట నుండి కొద్దికొద్దిగా తొలగిస్తారు. అడవి జంతువులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒకేసారి వారందరిని నాశనం చేయడానికి అనుమతి లేదు. 23 అయితే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించి, వారు నాశనం చేయబడేవరకు, వారికి గొప్ప కలవరాన్ని పుట్టిస్తారు. 24 ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తారు. మీరు వారి పేర్లను ఆకాశం క్రిందనుండి తుడిచివేస్తారు. మీకు విరోధంగా ఎవరు నిలువలేరు; మీరు వారిని నాశనం చేస్తారు. 25 మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము. 26 అసహ్యమైన వాటిని మీరు ఇంటికి తీసుకురాకూడదు, లేదా మీరు, దానివలె నాశనానికి మీరు వేరు చేయబడతారు. అది నాశనం కోసం వేరు చేయబడుతుంది కాబట్టి దానిని నీచమైనదిగా చూసి పూర్తిగా అసహ్యించుకోవాలి.
<- ద్వితీయో 6ద్వితీయో 8 ->- a అంటే, అషేరా దేవత యొక్క కర్ర చిహ్నాలు
Languages