3 కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము. 4 ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని మనం స్వాధీనం చేసుకున్నాము. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతమంతటిలో ఉన్న అరవై పట్టణాల్లో స్వాధీనం చేసుకోనిది ఒక్కటి కూడా లేదు. 5 ఈ పట్టణాలన్ని ఎత్తైన గోడలు, ద్వారాలు గడియలతో పటిష్టంగా ఉన్నాయి, వీటితో పాటు గోడలులేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. 6 హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లే ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులు, పిల్లలను పూర్తిగా నాశనం చేశాము. 7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.
8 ఆ సమయంలో ఈ ఇద్దరు అమోరీయుల రాజుల నుండి అర్నోను వాగు మొదలుకొని హెర్మోను పర్వతం వరకు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము. 9 హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు. 10 పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము. 11 రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు[a] కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.
18 ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి. 19-20 అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”
23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: 24 “ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు? 25 నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి.”
26 అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, “ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు. 27 నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు. 28 అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు.” 29 కాబట్టి మనం బేత్-పెయోరు దగ్గర ఉన్న లోయలో ఉన్నాము.
<- ద్వితీయో 2ద్వితీయో 4 ->
Languages