1 పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు. 2 సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా చెప్పి, అకాయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది. 3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను. 4 ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీరే కాదు మీమీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు మేము కూడా సిగ్గుపడాల్సి ఉంటుంది. 5 అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేలా సిద్ధపడి ఉండడానికి ప్రోత్సహించేలా మీ దగ్గరకు ముందుగానే సహోదరులను పంపడం అవసరమని నేను అనుకున్నాను.
12 మీరు చేసే ఈ పరిచర్య కేవలం పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాదు, దేవునికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెల్లించినట్టవుతుంది. 13 ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. 14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు. 15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.
<- 2 కొరింథీ పత్రిక 82 కొరింథీ పత్రిక 10 ->- a కీర్తన 112:9
Languages