5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి; మీరు పరీక్షలో ఓడిపోకపోతే తప్ప యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియదా? 6 కాని మేము పరీక్షలో ఓడిపోలేదని మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. 7 మీరు ఏ తప్పులు చేయకూడదని, మేము పరీక్షలో నిలబడినట్లు ప్రజలు చూడాలని కాదు గాని, మేము ఓడిపోయినట్లుగా కనిపించినా మీరు మాత్రం సరియైన దానినే చేయాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము. 8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, సత్యం కోసం మాత్రమే చేస్తాము. 9 మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పట్ల నేను కఠినంగా ఉండాల్సిన అవసరం లేకుండ ఇప్పుడే ఇవన్నీ మీకు వ్రాస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పడద్రోయడానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు నాకు అధికారాన్ని ఇచ్చారు.
13 ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు మీకు శుభాలు పంపుతున్నారు.
- a ద్వితీ 19:15
Languages