1 ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.
9 హిజ్కియా యాజకులను, లేవీయులను ఆ కుప్పలను గురించి అడిగాడు. 10 సాదోకు సంతతివాడు ముఖ్య యాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద మొత్తం మిగిలిపోయింది, అవే ఈ కుప్పలు.”
11 అప్పుడు యెహోవా మందిరంలో గిడ్డంగులు కట్టాలని హిజ్కియా ఆదేశించాడు. వారు అలాగే చేశారు. 12 ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు. 13 కొనన్యా చేతి క్రింద, అతని సోదరుడు షిమీ చేతి క్రింద తనిఖీ చేసేవారిగా యెహీయేలు అజజ్యాహు, నహతు, అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయా అనే వారున్నారు. వీరిని రాజైన హిజ్కియా, దేవుని మందిరానికి అధికారియైన అజర్యా నియమించారు.
14 ఇమ్నా కుమారుడైన కోరే అనే లేవీయుడు తూర్పు ద్వారానికి పాలకుడు. ప్రజలు దేవునికి స్వేచ్ఛగా అర్పించిన అర్పణ మీద అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టడం అతని పని. 15 అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు.
16 అంతేకాక, మూడేళ్ళు, ఆపైన వయస్సుండి, వంశావళిలో నమోదైన మగపిల్లలకు కూడా వారు పంచిపెట్టారు. వారి వారి వరుస ప్రకారం, బాధ్యత ప్రకారం సేవ చేయడానికి ప్రతిరోజు యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ కూడా వారి భాగాలు పంచిపెట్టారు. 17 వారి వారి పూర్వికుల కుటుంబాల ప్రకారం వంశావళిలో నమోదైన యాజకులకు, వారి వారి పనుల ప్రకారం, వరుస ప్రకారం, ఇరవై సంవత్సరాలు, అంతకంటే పై వయస్సున్న లేవీయులకు కూడా వారు పంచిపెట్టారు. 18 వారు నమ్మకంగా తమను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి ఆ వంశావళిలో ఉన్న వారందరి చిన్నపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెల కోసం కూడా పంచిపెట్టారు.
19 తమ పట్టణాల చుట్టుప్రక్కల భూములలో, ఇతర పట్టణాల్లో అహరోను వారసులైన యాజకులు కొందరు కాపురముండేవారు. వారిలో మగవారందరికీ వంశావళిలో నమోదైన లేవీయులందరికి వారి భాగాలను పంచడానికి పేరుపేరున మనుష్యులు నియమించాడు.
20 హిజ్కియా ఆ విధంగా యూదా అంతటా చేశాడు. యెహోవా దృష్టిలో మంచిగా, సరియైన విధంగా, నమ్మకంగా ప్రవర్తించాడు. 21 యెహోవా ఆలయ సేవ కోసం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోను అతడు తన దేవుని వెదికి అనుసరించాడు. మనస్పూర్తిగా పని చేశాడు కాబట్టి వర్ధిల్లాడు.
<- 2 దినవృత్తాంతములు 302 దినవృత్తాంతములు 32 ->
Languages