3 సొలొమోను దేవుని ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.[b] 4 మందిరం విశాల గదికి ముందు మంటపం ఉంది. దాని పొడవు ఇరవై మూరలు,[c] ఎత్తు నూట ఇరవై మూరలు.
8 అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది. 9 బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు,[e] మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు.
10 అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు. 11 ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల[f] పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది. 12 అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది. 13 ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి.
14 సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు.
15 మందిరం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్పై అయిదు మూరలు. వాటి మీద అయిదు మూరల ఎత్తుగల పీటలు కూడా చేయించాడు. 16 అతడు అల్లిన గొలుసులు[g] చేయించి స్తంభాల పైభాగంలో పెట్టాడు. వంద దానిమ్మపండ్లు కూడా చేసి గొలుసులకు తగిలించాడు. 17 మందిరం ముందు భాగంలో స్తంభాలను ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను[h] అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు[i] అని పేరు పెట్టాడు.
<- 2 దినవృత్తాంతములు 22 దినవృత్తాంతములు 4 ->- a ఒర్నాను అరౌనా ఒర్నానుకు మరొక రూపం
- b అంటే, సుమారు 27 మీటర్ల పొడవు 9 మీటర్ల వెడల్పు
- c అంటే, సుమారు 9 మీటర్లు
- d సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
- e అంటే, సుమారు 575 గ్రాములు
- f అంటే, సుమారు 2.3 మీటర్లు; ఇంకా 15 వచనంలో
- g లేదా గర్భాలయంలో గొలుసులు తయారుచేసి; హెబ్రీ భాషలో ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు
- h యాకీను బహుశ దీని అర్థం ఆయన స్థాపిస్తారు
- i బోయజు బహుశ దీని అర్థం ఆయనలో బలముంది
Languages