1 బయెషా గురించి హనానీ కుమారుడైన యెహుకు యెహోవా నుండి వచ్చిన వాక్కు: 2 “నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు. 3 కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను. 4 బయెషాకు సంబంధించిన వారిలో ఎవరు పట్టణంలో చనిపోతారో వారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
5 బయెషా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతడు సాధించిన విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 6 బయెషా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. తిర్సాలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఏలహు రాజయ్యాడు.
7 అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.
9 ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు. 10 జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.
11 జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు. 12 యెహోవా యెహు ప్రవక్త ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం జిమ్రీ బయెషా వంశం అంతటిని నిర్మూలం చేశాడు. 13 బయెషా అతని కుమారుడైన ఏలహు చేసిన పాపాలన్నిటిని బట్టి, వారు ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్ని బట్టి, వారి అయోగ్యమైన విగ్రహాలనుబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపారు.
14 ఏలహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
20 జిమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని తిరుగుబాటు వివరాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
23 యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు. 24 అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల[a] వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.
25 అయితే ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతని ముందున్న వారందరికంటే ఇంకా ఎక్కువ పాపం చేశాడు. 26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.
27 ఒమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 28 ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.
34 అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
<- 1 రాజులు 151 రాజులు 17 ->- a అంటే సుమారు 68 కి. గ్రా. లు
Languages