4 ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్ళలో, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్ళలో ప్రవేశించి వాళ్ళ ఇళ్ళలో ఉండి ఇళ్ళను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది.
7 గంపకు ఉన్న సీసపు మూత తీసినప్పుడు గంపలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడింది. 8 అప్పుడతడు “ఇది దోషంతో నిండి ఉంది” అని నాతో చెప్పి గంపలో ఆ స్త్రీని పడవేసి సీసపు మూతను గంపపై ఉంచాడు. 9 నేను మళ్ళీ చూసినప్పుడు ఇద్దరు స్త్రీలు బయలుదేరారు. సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వాళ్లకు ఉన్నాయి. గాలికి వాళ్ళ రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు వచ్చి గంపను మోసుకుంటూ భూమి ఆకాశాల మధ్యకు దాన్ని ఎత్తారు. 10 నేను నాతో మాట్లాడుతున్న దూతతో “వీళ్ళు ఈ గంపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?” అని అడిగాను. 11 అందుకతడు “షీనారు దేశంలో దాని కోసం ఒక గృహం నిర్మించడానికి వాళ్ళు వెళ్తున్నారు. గృహం సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని నియమిత స్థలంలో ఉంచుతారు” అని జవాబిచ్చాడు.
<- జెకర్యా 4జెకర్యా 6 ->