Link to home pageLanguagesLink to all Bible versions on this site
21
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన.
1 యెహోవా, రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు!
2 అతని హృదయవాంఛను నువ్వు మంజూరు చేశావు, అతని పెదాల్లోనుంచి వచ్చిన ప్రార్థన నువ్వు అంగీకరించక మానలేదు.
3 అతని కోసం శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తెస్తావు, నువ్వు అతని తల మీద మేలిమి బంగారు కిరీటం పెట్టావు.
4 ఆయుష్షు ఇమ్మని అతడు నిన్ను అడిగాడు. నువ్వు దాన్ని అతనికిచ్చావు. శాశ్వతకాలం ఉండే దీర్ఘాయుష్షు అతనికిచ్చావు.
5 నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు.
6 శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు.
7 ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
8 నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది.
9 నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది.
10 భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు.
11 వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు.
12 నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు.
13 యెహోవా, నీ బలాన్నిబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకో. నీ శక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తాము.

<- కీర్తనలు 20కీర్తనలు 22 ->