నెహెమ్యా గ్రంథకర్త యూదుల సంప్రదాయం నెహెమ్యా (“యోహోవా ఆదరణ”) ఈ చారిత్రిక గ్రంథానికి ముఖ్య గ్రంథకర్తగా గుర్తిస్తున్నది. ఈ గ్రంథంలో ఎక్కువ భాగం అతని వ్యక్తిగత అనుభవాలే. ఇతని యవ్వన ప్రాయం, నేపధ్యం గురించి సమాచారం లేదు. అర్తహషస్త రాజుకు గిన్నె అందించే వాడుగా, పారశీక రాజాస్థానంలో రాజోద్యోగిగా మొదటిగా ఇతన్నిచూస్తాం (నెహెమ్యా 1:11-2:1). నెహెమ్యా గ్రంథాన్ని ఎజ్రా గ్రంథానికి రెండవ భాగంగా చదువుకోవచ్చు. ఈ రెండూ మొదట్లో ఒకే పుస్తకం అని కొందరు పండితులు అభిప్రాయం. రచనా కాలం, ప్రదేశం సుమారు క్రీ. పూ. 456 - 400 ఈ గ్రంథం యూదయలో యెరూషలేములో రాశారు. యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చాక పారశీక రాజ్యపరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది. స్వీకర్త బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు. ప్రయోజనం దేవుడు ఎన్నుకున్న ప్రజల పట్ల ఆయన ప్రేమ, ఆయన పట్ల వారికి ఉండవలసిన నిబంధన బాధ్యతలను వారు గుర్తించాలన్నది నెహెమ్యా స్పష్టమైన ఉద్దేశం. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. వారి జీవితాలు పట్ల ఆయన ఆసక్తి చూపుతాడు. వారు తన అజ్ఞలు పాటించడానికి వారికి అవసరమైన వాటిని ఇస్తుంటాడు. ప్రజలు తమ వనరులను ఒకరితో ఒకరు పంచుకుంటూ కలిసి పనిచెయ్యడం అవసరం. దేవుని ప్రజల మధ్య స్వార్దానికి తావు లేదు. పేదల నిస్సహాయతను అసరాగా తీసుకొని వారిని దోచుకోకూడదని ధనికులకు, రాజవంశీయులుకు నెహెమ్యా హెచ్చరించాడు. ముఖ్యాంశం పునర్నిర్మాణం విభాగాలు 1. గవర్నరుగా మొదటి నియామకం — 1:1-12:47 2. గవర్నరుగా రెండవ నియామకం — 13:1-31
1నెహెమ్యా ప్రార్థన 1 హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. నేను 20 వ సంవత్సరం కిస్లేవు*కిస్లేవు బబులోను కాలమానంలో కిస్లేవు తొమిదో నెల, యూదా కాలమానంలో కిస్లేవు నెల ఇప్పటి నవంబరు, డిసెంబరు నెలల్లో భాగం. నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో†క్రీ. పూ. 465-425 పారసీక మొదటి రాజు అర్తహషస్త పాలనలో నెహెమ్యా ఏలాం దేశంలో షూషన్ పట్టణం లో నివసించే సమయం. 2 నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.3 అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.
4 ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను. 5 “ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు. 6 నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం. 7 నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు. 8 నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను. 9 అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.
10 మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా. 11 యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.”
నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.
నెహెమ్యా 2 ->
3 అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.